NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా మీడియా ప్రతినిధులకు ఎలాంటి ప్రత్యేక పాసులు జారీ చేయబడలేదని అసిస్టెంట్ ఎన్నికల అధికారి, చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన అక్రెడిటేషన్ కార్డుల ఆధారంగా, ఎన్నికల కమీషన్ నిబంధనలకు లోబడి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా, ఓటు గోప్యత బహిర్గతం కాకుండా ఎన్నికల సరళిని కవర్ చేయాలని సూచించారు.