NZB: ఆలూర్ మండలంలో ఖండే రాయుడు (మల్లన్న) జాతర డిసెంబర్ 07న ఆదివారం నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, సాయంత్రం రథోత్సవం కార్యక్రమాలని చూడడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు.