KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బుధవారం జరుగనున్న సమీక్షా సమావేశం వాయిదావేసినట్లు ఆలయ ఈవో సుధాకర్ తెలిపారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని EO అన్నారు.