KMR: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతంగా, నాణ్యతతో నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 2,38,682 మంది దరఖాస్తు చేసుకోగా 1,39,194 సర్వే పూర్తైందన్నారు. జనవరి 3వ తేదీలోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. పన్ను వసూళ్లు, వనమహోత్సవం, ఉపాధి హామీ పథకాలు, మహిళా శక్తి కార్యక్రమాలపై చర్చించారు.