ASF: తెలంగాణ వైద్య విధాన పరిషత్ బిల్లుపై సిర్పూర్ MLA హరీష్ బాబు అసెంబ్లీలో బుధవారం ప్రసంగించారు. TVVPని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ప్రభుత్వాన్ని MLA అభినందించారు. దీని ద్వారా ఉద్యోగులకు జీతాలు, అలవెన్సెస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. జిల్లా ఆసుపత్రుల్లో MRI, సిటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్ ఏర్పాటు చేయాలని కోరారు.