PDPL: రానున్న 2 రోజులపాటు పెద్దపల్లి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా పెద్దపల్లి జిల్లాలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పెద్దపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.