RR: ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన ప్రతి పేదవారికి కట్టించి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రం అప్పుల వలయంలో ఉన్నా కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.