NRML: రత్నాపూర్ (కాండ్లి) జెడ్పీ సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. పాఠశాలలో పారిశుధ్యం, పచ్చదనం మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందించాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ప్రోత్సహించారు. ఈ తనిఖీల్లో డీఈవో భోజన్న, తదితరులు పాల్గొన్నారు.