KMM: ఎర్రుపాలెం మండలంలో గురువారం కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో 18 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7.10 లక్షల CMRF చెక్కులను పంపిణీ చేశారు. మధిర మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహరావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొని చెక్కులను అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో ఈ సహాయం అందిందని తెలిపారు.