VKB: జిల్లాలో ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నడిచి ఐకమత్యానికి పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళికి శాంతి, సౌభ్రాతృత్వం, సేవాస్ఫూర్తిని చాటుతాయని తెలిపారు.