ASF: ఉపాధి హామీ పథకానికి వెళ్లే కూలీలకు 2 పూటల హాజరువేయాలని బెజ్జుర్ APO రాజన్న తెలిపారు. కూలీల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌పై అవగాహన ఉన్న ఒకరికి శిక్షణ ఇస్తామన్నారు. కూలికి వెళ్లేవారు గ్రామసభకు హాజరై కొత్త విధానాన్ని నేర్చుకొని కూలీకి వెళ్లాల్సిందిగా సూచించారు. ప్రతి కూలి ఉదయం ఫేస్ రీడింగ్ హాజరు వేసుకున్న తర్వాత తిరిగి 4 గంటలకు మళ్లీ హాజరు వేయాలని సూచించారు.