BHPL: రేగొండ మండలం రూపురెడ్డిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు తెచ్చే ధాన్యంలో తేమ శాతాన్ని ఖచ్చితంగా పరిశీలించి వేగంగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు పూర్తయ్యాక 24 గంటల్లో టాబ్ ఎంట్రీలు తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు.