MBNR: అమ్రాబాద్ పట్టణ రూపురేఖలు మారుస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.