CM KCR ON PRE POLL:లిక్కర్ స్కామ్‌లో (Liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం (cabinet meeting) నిన్న సమావేశమైన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్లో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ విసృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశం తర్వాత పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ (cm kcr) మీడియాతో మాట్లాడారు.
CM KCR ON PRE POLL:లిక్కర్ స్కామ్‌లో (Liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం (cabinet meeting) నిన్న సమావేశమైన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్లో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ విసృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశం తర్వాత పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ (cm kcr) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని తేల్చిచెప్పారు. లిక్కర్ స్కామ్‌లో కవిత (kavitha) అరెస్ట్ అయితే ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ (kcr) స్పందించారు.
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ (cm kcr) తెలిపారు. సమయం ఎక్కువగా లేదని.. ప్రజల్లోకి వెళ్లాలని నేతలు సూచించారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కోరారు. పాదయాత్రకు ప్లాన్ చేసుకోవాలని.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం పక్కా అని విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని నేతలకు స్పష్టంచేశారు. ప్రజల సమస్యలను తీర్చడంలో ముందు ఉండాలని కోరారు.
ఇటు ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ ప్లీనరీ (brs plenary) నిర్వహించడం లేదని సీఎం కేసీఆర్ (kcr) స్పష్టంచేశారు. ప్లీనరీకి బదులు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. ఆ రోజు వరంగల్‌లో (warangal) బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీలో గల ఈడీ కార్యాలయానికి ఆమె తన లాయర్‌తో కలిసి వెళతారు. ఈ నెల 9వ తేదీన ఆమె విచారణకు హాజరుకావాలి.. అయితే ఈ రోజు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం ఉండటంతో మరో రోజు వస్తానని ఈడీకి కవిత (kavitha) లేఖ రాశారు. దీంతో శనివారం ఆమె విచారణకు హాజరవబోతున్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత (kavitha) పాత్ర ఉందని.. ఆమె అరెస్ట్ తథ్యం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు.