NLG: చిట్యాలకు చెందిన చిలుకూరి ప్రసాద్ సతీమణి భద్రమ్మ గుండెపోటుతో మృతి చెందారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు శుక్రవారం మృతదేహంపై పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, పట్టణ కార్యదర్శి బొబ్బలి సుధాకర్ రెడ్డి ఉన్నారు.