MDCL: ఉప్పల్ గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద ఏప్రిల్ రెండవ తేదీన భారీ స్థాయిలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు వెల్లడించారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని, భక్తజనం భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. హనుమాన్ యువసేన ఉప్పల్ గణేష్ నగర్ వాసులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.