MNCL: హాజీపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అడవి పందుల దాడి తీవ్రమవుతుంది. టీకానపల్లి గ్రామానికి చెందిన తిప్పని కుమారస్వామికి చెందిన పంట పొలంలో అడవి పందులు దాడి చేశాయి. ఈ ఘటనలో 2 ఎకరాల మొక్కజొన్న పంట ధ్వంసమైంది. చేతికొచ్చిన పంట నేలమట్టం కావడంతో బాధితుడు విషాదంలో మునిగాడు. అధికారులు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.