NRPT: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే ‘ప్రధానమంత్రి సంసాద్ ఖేల్’ ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్ పాండు రెడ్డి అన్నారు. ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం క్రీడలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉమేష్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ రామచంద్రయ్య, మండల అధ్యక్షుడు శివరాజ్, ఉదయభాను, గోవర్ధన్ గౌడ్, క్రీడాకారులు పాల్గొన్నారు.