MNCL: జన్నారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలలో భాగంగా మండలంలోని పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఆ ఇండ్ల నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టామని హౌసింగ్ ఏఈ రియాస ఆలీ తెలిపారు.