WGL: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాద్ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.