SRD: గుమ్మడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిఇవాళ జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ల్యాబ్ సదుపాయాలు, వైద్య సేవలను పరిశీలించారు. అలాగే ఆస్పత్రిలో రోగులకు అందుతున్న మందుల లభ్యతపై ఆరా తీశారు. అదేవిధంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా, పూర్తి ఖచ్చితత్వంతో వివరాలను నమోదు చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.