ADB: నార్నూర్ మండలంలోని బలాన్పూర్ గ్రామంలో సోమవారం వరకట్నాలకు ‘నో’ చెప్పుతూ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్బంగా వధువు కామేశ్వరి వివాహానికి గ్రామస్థులు కలిసి రూ. 25,101 ఆర్థిక సహాయం అందజేశారు. ఇక నుంచి గ్రామంలో జరిగే పెళ్లిలో వరకట్నాలు తీసుకోబోమని నిర్ణయించారు. కార్యక్రమంలో తిరుపతి, భీంరావు, వినాయకరావు, తెలంగారావు, పరమేశ్వర్ ఉన్నారు.