JN: జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్‌ను రద్దుచేయాలని LHPS నాయకులు బానోతు సునీల్ నాయక్ ఇవాళ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పలువురు ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పేరుతో వారి ఇంటి దగ్గరలో ఉన్న పాఠశాలలకు విధులను మార్చుకొని, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. దీనిపై జిల్లా గిరిజన సంక్షేమ అధికారి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.