VKB: మర్పల్లి మండలంలోని పంచలింగాల్ గ్రామంలో మేతరి మాణికుమార్(23) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మరణించాడు. విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సనగారి కొండల్ రెడ్డి మాణికుమార్ అంత్యక్రియల నిమిత్తం 5 వేల రూపాయలు పంపించారు. శనివారం మర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సురేశ్ గ్రామస్తులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యలకు అందచేశారు