KDP: మైదుకూరులో గతంలో ఏర్పాటు చేసిన చిన్న విగ్రహాల స్థానంలో పెద్దవి ఏర్పాటు చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా బావిస్తున్నానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. మైదుకూరులో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు, వేమారెడ్డి విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు, స్వాగతం పలికారు.