నెల్లూరు: 2025-26 బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర పునఃనిర్మాణం దిశగా రూ.3.22 లక్షల కోట్లతో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా బడ్జెట్‌ను రూపొందించడం హర్షించదగ్గ విషయమన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు నిధులు భారీగా కేటాయించారన్నారు.