NLR: లింగసముద్రంలో ఇటీవల జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో జరిగిన గొడవపై MPP పెన్నా క్రిష్ణయ్య శుక్రవారం జిల్లాపరిషత్ CEOని కలిసి ఫిర్యాదు చేశారు. సభ్యులు కాని వారు కొందరు అనుమతి లేకుండా సమావేశం హాలులోకి జొరబడి MLC తూమాటి మాధవరావు, తనతో వాగ్వాదానికి దిగారని ఆరోపించారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.