KDP: కొండాపురంలోని గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. శుక్రవారం కడపలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో గండికోట ప్రాజెక్టు ముంపువాసులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.