మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ వసతిగృహాలను శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు స్టడీ అవర్‌ను పరిశీలించి పలు ప్రశ్నలతో పాటు మార్కులు సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు.