అన్నమయ్య: మున్సిపల్ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లెలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.