ELR: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఆరు జిల్లాల నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలకు తీసుకువచ్చారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.