ASR: భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మొదటి వ్యక్తి సర్ సీవీ రామన్ అని సైన్స్ ఉపాధ్యాయులు బెనర్జీ, అప్పారావు అన్నారు. శుక్రవారం కొయ్యూరు మండలం డౌనూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. భారత శాస్త్రవేత్త సీవీ రామన్ కాంతిపై అనేక ప్రయోగాలు చేసి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారన్నారు.