ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయులు సోమవారం పర్యటించనున్నారు. అందులో భాగంగా పెద్ద చెర్లోపల్లిలో సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న తరగతి గదులకు మంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు.