SRD: పటాన్చెరులోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న 35వ, మైత్రి క్రికెట్ ఇన్విటేషన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. విజేతలకు బహుమతులను అందజేశారు. నియోజకవర్గంలో యువ క్రికెటర్లను తయారు చేయడంలో మైత్రి క్రికెట్ క్లబ్ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.