MNCL: ప్రభుత్వ ఉపాధ్యాయులకు నష్టం చేసే కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని పీఆర్టియు జన్నారం మండల నాయకులు కోరారు. సోమవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలో స్థానిక తాహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సీపీఎస్ విధానంతో ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టియు మండల బాధ్యులు ఉన్నారు.