MNCL: జన్నారం మండలంలోని రాంపూర్‌లో అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణానికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ భూమి పూజ నిర్వహించారు. సోమవారం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనానికి భూమి పూజ చేశారు. ప్రజల మేలుకోసమే అంగన్వాడి కేంద్రాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడబ్లుఓ రవూఫ్, సిడిపిఓ రేష్మ, తాహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఉన్నారు.