NLR: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు వైస్ ఛైర్మన్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో బుచ్చి మున్సిపాలిటీకి వైస్ ఛైర్మన్ల ఎంపిక జరగాల్సి ఉంది. గత ప్రభుత్వంలో వైస్ ఛైర్మన్ లుగా షాహుల్, లలిత ఉండగా వారు రెండున్నర సంవత్సరాల తర్వాత రాజీనామా చేశారు. దీంతో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వైస్ ఛైర్మన్ల ఎంపికకు బ్రేక్ పడింది.