కోనసీమ: ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి భారీ విరాళం అందింది. ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామానికి వంకా అన్నవరం 2 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. దేవస్థానం అభివృద్ధి పనుల్లో భాగంగా శ్రీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి వినియోగించాలని దాతలు కోరారు. అనంతరం దాతలను ఆలయ ఈవో, గ్రామస్తులు అభినందించారు.