కృష్ణా: మార్చి 1వ తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల దృశ్య విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పల్లెల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు పరీక్షా సమయంలో పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునే ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.