AP: జైల్లో ఉన్న వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. వంశీకి ఆస్తమా ఉందని.. నిన్న కోర్టుకి వచ్చినప్పుడు కూడా నీరసంగా ఉన్నారన్నారు. ‘వంశీని మెంటల్‌గా డిప్రెషన్‌కు గురిచేయాలనుకుంటున్నారు. వంశీపై కక్ష సాధింపు ఎందుకు. అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చా’ అని పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.