MNCL: యాసంగి రైతు భరోసా డాటా ఎంట్రీ కానివారు ఈనెల 31 వరకు ఏవో కార్యాలయంలో సంప్రదించాలని ఏవో సంగీత సోమవారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాటా ఎంట్రీ కోసం పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లను విధిగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.