SRPT: తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన పోలేపాక రామచంద్రు తండ్రి బిక్షం ఇటీవల గుండెపోటుతో మరణించడంతో సోమవారం కాంగ్రెస్ జిల్లా నాయకులు రేగటి రవి బిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. వారి వెంట దాసరి శ్రీను, వెంకటేష్, శ్రీకాంత్, ఎల్లయ్య పాల్గొన్నారు.