NLR: దగదర్తి మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దగదర్తి మండల టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు విచ్చేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వ్యవసాయమే తమ జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్న రైతుల పొలాల సమస్యలపై దృష్టి సారించాలన్నారు.