NRML: ఇటీవల బాసర జోన్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీటింగ్ కొరకు 16 మంది వివిధ విభాగాల్లో సెలెక్ట్ అయ్యారని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో వారిని అభినందించి, స్టేట్ స్పోర్ట్స్ మీట్లో అత్యుత్తమ ప్రతిభ చూపెట్టి మెడల్స్ వచ్చేలా ఆడాలని, ఆల్ ఇండియా లెవల్‌కు ఎంపిక కావాలని కోరారు.