GNTR: పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ రమేష్ బాబు సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి పర్యటించారు. డ్రైనేజీలు, రోడ్లు పరిశీలించారు. శానిటేషన్‌కు సంబంధించిన పలు అంశాల మీద క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని, మురుగు కాలువల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందికి తెలిపారు.