NLR: సంగం మండల కేంద్రంలో సోమవారం రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ నుండి జాతీయ రహదారి వరకు మహిళలతో హెల్మెట్ అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేశారు. ప్రతీ ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సహకరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేష్, తదితరులు పాల్గొన్నారు.