NLR: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2025 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే ఈ ఘనత సాధించటం నారా చంద్రబాబు పనితీరుకు, ముందు చూపుకు నిదర్శనమన్నారు.