KMR: ఎల్లారెడ్డిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. మల్లయ్యపల్లి, అచ్చాయిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అధికారులు పాల్గొన్నారు.