బాపట్ల: రైతుల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం నామమాత్రంగానే ధాన్యం కొనుగోలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. సోమవారం జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రచార ఆర్భాటాలే తప్ప రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వెంటనే రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.