NLR: సంగం మండలంలోని దువ్వూరు గ్రామంలో సోమవారం పశు వైద్య శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు రకాల పశువులకు ఉచితంగా వైద్యం చేసి మందులను పంపిణీ చేశారు. అనంతరం నట్టల నివారణ మందులను పాడి రైతు సోదరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు పశు వైద్య అధికారి డాక్టర్ సుజని, సిబ్బంది, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.